ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోషకాల లోపం అనేకమంది పురుషుల్లో సంతానలేమికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అయితే సంతానాలు ఏమిటి చెక్ పెట్టడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పురుషుల్లో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టడంలో విటమిన్ సి కలిగిన ఆహారాలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి స్పార్శ్ క్వాలిటిని, క్వాంటిటీని పెంచుతాయి. అంతేకాకుండా స్పెర్మ్ మొబిలిటీని మెరుగు రుస్తాయి కాబట్టి వంధ్యత్వంతో బాధపడేవారు తమ డైట్లో భాగంగా క్యాప్సికమ్, స్ట్రాబెరీ, బొప్పాయి, నిమ్మ, జామ, దానిమ్మ, కివి, ఉసిరి...
వంటి ఆహారాలను చేర్చుకోవాలి. వీటితోపాటు సి ఈ విటమిన్ కలిగిన అన్ని కూరగాయలు, పండ్లు తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పురుషుల్లో వీర్యం ఉత్పత్తి రావటానికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చాపలు, మాసం, మొక్క ఆధారిత ఆహారాల ద్వారా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక జింక్ అనేది పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తికి ముఖ్యమైన పోషకం. ఇది సంతానోత్పత్తిని, కండరాల ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుంది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, క్వాలిటీ, మొబిలిటి సక్రమంగా లేకపోయినా స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉండదని చెబుతున్నారు.