ఉదయాన్నే లేచిన వెంటనే వేడివేడిగా కప్పు టీ తాగితే వచ్చే మజా మాటల్లో చెప్పలేనిది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం పూట టీ కాచే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి కల్తీ టీ పొడిని విక్రయిస్తుంటారు. దీనిని వినియోగిస్తే కిడ్నీ, లివర్ సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు వాడేటి అసలైనదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ కింద సింపుల్ చిట్కాలని ట్రై చేయండి. ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాలు కల్తీ మాయం అవుతున్నాయి.

 ఇందులో టీ పొడి ముఖ్యమైనది. కొబ్బరి పొట్టు పోడి, చెట్టు బెరడు పొడి, చింతపండు గింజల పొడి సహా రకరకాల రసాయనాలు కలిపినా టి పొడిని మార్కెట్లో కల్తీ రాయుళ్లు విక్రయిస్తున్నారు. మీరు ఇంట్లో వాడుతున్న టీ పౌడర్ నకిలీ అయితే దానిని వాడటం మానేయటం మంచిది. ఇలా నకిలీ టీ పౌడర్ తో తయారు చేసిన టీ తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. నీళ్లల్లో పౌడర్ ని పరీక్షించడం ద్వారా టీ పొడి అసలైనదా,నకిలీదా అని తెలుసుకోవాలి. ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. దీనిలో టీ పొడి వేయాలి. వెంటనే రంగు వదిలితే అది నకిలీ..

ముదురు రంగు లేకుండా టీ పొడి మొత్తం నీటి అడుగుకు ఎరితే అది అసలైనదని అర్థం. మీరు వాడే టీ పౌడర్ నిజమో కాదో తెలుసుకోవడానికి మరో చిట్కా... మీరు బ్రాండెడ్ టీ పొడిని కొనుగోలు చేస్తే, టీ పొడి రేణువులు ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. కల్తీ అయితే టీ రేణువుల వివిధ రంగులలో ఉంటాయి. గ్రీన్ టీ పొడి అయితే అందులో ఆకుల పొడి కలిసే అవకాశం ఉంటుంది. కల్తీ లేని టీ పొడి తో కలిసిన టి సుగంధం మాదిరి రుచిగా ఉంటుంది. అయితే టీ పొడిలో కల్తీ చేరితే అది రుచికి చేదుగా ఉంటుంది. పొడి అసలైనదో కాదో తెలుసుకోవటానికి తయారు చేసిన టీ రంగును గమనించవచ్చు. టీ కి తగిన స్పష్టమైన రంగు ఉంటే అది స్వచ్ఛమైనదని అర్థం. నిస్తేజంగా లేదా అసహజ రంగు ఉంటే కల్తీ అని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: