చపాతి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం. గోధుమపిండి విటమిన్లు, ఖనిజాలు, సోడియంతో నిండు ఉంది. మధుమేహ రోగులకు చక్కటి ఆహారం. చపాతీలు మృదువుగా రావటం కొన్నిసార్లు కష్టతరం. అయితే గోధుమపిండి, నూనె లేదా నెయ్యి, నీటితో పిండిని కలిపి చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటిని ప్లాస్టిక్ కవర్ మధ్య ఉంచి ప్రెస్ చేస్తే చపాతీలు సులభంగా తయారవుతాయి. ఆ తరువాత టావా మీద వేసి రెండు వైపులా చక్కగా కాల్చండి. వీటిని కూరలతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి. మన కిచెన్ లో సాధారణంగా ఉపయోగించే ఆహారాల్లో ఒకటి చపాతి. గోధుమ పిండి విటమిన్ B1, B2, B6, B9 వంటి పోషకాలతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్ ప్రెస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి.

120 గ్రాముల గోధుమ పిండిలో సుమారు 190 మిల్లి గ్రాముల సోడియం ఉంటుంది. చపాతి మధుమేహ రోగులకు చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంతరించడంలో సహాయపడుతుంది. మృదువైన చపాతీలు చాలామందికి ఇష్టమైనవి, ముఖ్యంగా పెద్దవారికి. వీటిని కూరగాయల లేదా మాంసాహార కర్రీలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. అయితే చపాతీలు మృదువుగా రావటం కొన్నిసార్లు కష్టమవుతుంది. కానీ ఈ సులభమైన పద్ధతిలో మీకు కావాల్సిన మృదువైన చపాతీలు తయారు చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఒక కప్పు గోధుమపిండి, అరకప్పు నీరు తీసుకుని బాగా కలపండి. ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి, చిటికెడు ఉప్పు, చక్కెర వేసి కలపండి. ఆ తర్వాత వీటిని మెల్లిగా కలిపి మృదువైన పిండి తయారు చేయండి. పిండిని ముద్దలుగా చేసుకునే పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ లేదా గోధుమ పిండి కవర్ ని తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేయండి. కవర్ను శుభ్రంగా తుడిచి మధ్యలో ఒక పిండి ముద్దను ఉంచండి. దీని మీద మరొక పక్కా కవర్ ఉంచి ఒక గిన్నెతో ప్రెస్ చేయండి. అన్ని ఇలానే చేసి పక్కకు పెట్టండి. ఆ తర్వాత చపాతీని టావా మీద వేసి రెండు వైపులా చక్కగా కాల్చండి.

మరింత సమాచారం తెలుసుకోండి: