సరైన ఆహారం, జీవన శైలి లేదా ధూమపానం తండ్రి నుండి బిడ్డకు జన్యుపులలో మార్పులకు కారణం అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక బరువు ఉన్న తండ్రులకు పుట్టిన పిల్లలు గర్భంలోనే ఎదుగుదల సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, దీని కారణంగా వారు సరిగ్గా ఎదగరు మరియు వారి బరువు కూడా తక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి అనేక రకాల శారీరక, మానసిక సమస్యలు ఉంటాయి. గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కొవ్వు కాలేయం, మధుమేహం, కీళ్ళు, ఎముకలలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,

 జీర్ణాశయాంతర సమస్యలు, నిరాశ, ఆందోళన మొదలైనవి ఉంటాయి. అయితే అధిక బరువు ఉన్న పురుషులకు పుట్టే బిడ్డలు కూడా తక్కువ బరువుతో ఉంటారని మీకు తెలుసా. స్థూలకాయం పురుషుల స్పెర్మ్ dna నిర్మాణం, నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుందని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన రిబిరో ప్రిటో మెడికల్ స్కూల్ పరిశోధకులు ఇటీవల ఒక పరిశోధనలు కనుగొన్నారు. 89 మంది తల్లిదండ్రులు, వారి నవజాత శిశువుల బరువును పరిశీలించినప్పుడు పురుషుడి నడుము పరిమాణం, BMI ఎంత తక్కువగా ఉంటే, వారి పిల్లల తల చుట్టుకొలత అంత చిన్నదిగా ఉంటుందని వెళ్లడైంది.

పరిశోధకుడు డాక్టర్ మరియానా రివాల్డి కార్వాల్హో మాట్లాడుతూ, ' పిండం పెరుగుదల, తల్లి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటానికి చాలా పరిశోధనలు జరిగాయి. అయితే పిండం, తండ్రి ఆరోగ్యం కూడా ప్రభావితం చేస్తుందని మా పరిశోధనలు వెళ్లడైందని అన్నారు. గర్భధారణ సమయంలో, డెలివరీ తర్వాత పిల్లల ఆరోగ్యం భారత దేశ ఎదుగుదలకు గణనీయంగా దోహదపడుతుందన్నారు. మా పరిశోధన బ్రెజిలియన్ కుటుంబాలకు సంబంధించిన మొదటి పరిశోధన. ఇది తండ్రి BMI ఎక్కువ, పిల్లల జనన బరువు తక్కువగా ఉంటుందని తేలింది. అధిక బరువు ఉన్నవారికి అనేక రకాల శారీరక, మానసిక సమస్యలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: