భోజనం చేసాక కడుపు ఫుల్ అయినా ఫీలింగ్ రావాలి అంటే మనం తినే భోజనం వేళ అప్పడాలు ఉండాల్సిందే. కానీ మార్కెట్ ప్రతిసారి సారి వెళ్లి తెచ్చుకోలేముగా.. అలాంటి వారి కోసమే చిన్న వంటకం. మినప్పిండితో ఇంట్లోనే కరకరలాడే అప్పడాలను సులభంగా తయారు చేయండి. ఒక కప్పు మినప్పిండితో సుమారుగా 50 అప్పడాలను తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే. మన ఇంట్లో సాధారణంగా సాంబార్ చేసినప్పుడు లేదా పప్పులతో పలు రకాల వంటకాలు చేసినప్పుడు మనకు వెంటనే తుక్కు వచ్చేది అప్పడాలు. ఇవి లేకపోతే భోజనం చేసినా కడుపు ఫుల్ అయినా ఫీలింగ్ రాదు. అందుకే దాదాపు అందరి ఇళ్ళల్లో అప్పడాలు ఉంటాయి. కొంతమంది ఇంట్లోనే తయారు చేస్తారు.

 మరికొంతమంది మార్కెట్లో నుండి కొనుగోలు చేస్తారు. ఇలాంటి వారి కోసమే నేను సింపుల్ రెసిపీని తెచ్చాను. ఈ వంటకాన్ని ఎవరైనా ఈజీగా చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. 250 గ్రాముల తెల్ల మినప్పప్పును తీసుకుని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకోవాలి. ఇలా పట్టిన మినప్పిండి పౌడర్ కు 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా ముద్దలా చేసుకోవాలి. మినప్పిండి నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే నీరు వేసుకోవాలి.

 పిసుకుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కలిపితే ముద్ద మృదువుగా మారుతుంది. ముద్ద సిద్ధమైపోయిన తర్వాత దాన్ని 8 సమాన ముద్దలుగా విభజించాలి. ప్రతి ముద్దను చపాతీలా పలుచుగా చెయ్యాలి. అరకుప్పుమైదా పిండి చల్లి పొరల అలచగా తేలికగా చేసిన తర్వాత డబ్బా మూత లేదా చిన్న గ్లాస్ తో రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన అప్పడాలను వెళ్తురు బాగా ఉండే చోట, ఎండ ఉన్నచోట ఉంచి బాగా ఎండబెట్టాలి. ఎండి విరిగిపోయే దశకు వచ్చేవరకు ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన అప్పడాలను నూనెలో వేడి చేసి కరకరలాడే ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే సులభంగా రుచికరమైన అప్పడాలను తయారు చేసి తింటూ ఆనందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: