ఇడ్లీ సాఫ్ట్ గా, మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మీరు అనుకున్నట్లు వస్తాయి. ఆ కాలా గురించి ఇప్పుడు చూద్దాం. ఇడ్లీ సాఫ్ట్ గా రావాలంటే మంచి నాణ్యమైన మినప్పప్పు అవసరం. ఆ మినప్పప్పు తాజాగా ఉండాలి. కొంతమంది ఇడ్లీకి సోడా వేస్తుంటారు. ఇలా చెయ్యకూడదు. సోడా అవసరం లేకుండానే మంచి ఇడ్లీని మీరు చేసుకోవచ్చు. సోడా వేయటం వల్ల మాత్రం ఇడ్లీ రుచి మారుస్తుంది. మినప్పప్పును 2-3 గంటలే నానబెట్టాలి. ఎక్కువ సమయం నానబెట్టిన.. తక్కువ సమయం ఉంచిన ఇడ్లీ సాఫ్ట్ గా ఉండవు. మినప్పప్పు 1 కప్పు అయితే బియ్యం 4 కప్పులు కలుపుకోవాలి. ఇదే సరైన కొలత. మినప్పప్పును ముందుగా రుబ్బాలి. తర్వాత బియ్యాన్ని రుబ్బటం చేయాలి.
మినప్పప్పు నువ్వేటప్పుడు నీరు కొద్ది కొద్దిగా కలుపుతూ రుబ్బాలి. ఒక్కసారిగా నీరు పోస్తే మినప్పప్పు సరిగ్గా రుబ్బుకోదు. మినప్పప్పును క్రిమ్ మాదిరిగా మెత్తగా రుబ్బాలి. ఒక్కసారిగా నీరు పోస్తే మినప్పప్పు సరిగ్గా రుబ్బుకోరు. ఒక విధంగా చెప్పాలంటే రుబ్బిన ఈ మినప్పప్పును కప్పు వాటర్ లో వేసి అది పైకి తేలాలి అప్పుడు ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి. బియ్యాన్ని కూడా బాగా మెత్తగా కాకుండా కాస్త గట్టిగా రూబ్బాలి. ఇది ఇడ్లీకి మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. బియ్యం నానబెట్టిన నీటినే ఉపయోగిస్తే ఇంకా బాగుంటుంది. ఇడ్లీ సాఫ్ట్ గా రావాలంటే రుబ్బిన ఈ ఇడ్లీ పిండిని కనీసం 8 గంటల పాటు పులవనివ్వాలి. అంత సమయం లేకపోతే ఇడ్లీ గట్టిగా తయారవుతుంది.