ఈ సమయంలో రోజువారి పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నొప్పిని భరించడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కడుపునొప్పి ఎక్కువగా వచ్చిన, బ్లీడింగ్ ఎక్కువగా జరిగిన అందుకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. నెలసరిలో నొప్పి రావడానికి గర్భాశయ ఫైబ్రాయిడ్లు కూడా ఒక కారణం కావచ్చు. దీని కారణంగా కూడా అధిక రక్తస్రామం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఇది గర్భాశయం లో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటి తిత్తులుగా పెరగటం వల్ల ఇలా అవుతుంది. టాక్టిక్ షాక్ సిండ్రోమో కారణంగా కూడా రుతుక్రమంల నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు సంకేతంగా చెబుతారు.
స్టెఫిలో కాకస్ శరీరంలోకి ప్రవేశించి... విషాన్ని చేసినప్పుడు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కు దారితీస్తుంది. ఎండోమెట్రియోసిన్ కారణంగా కూడా పీరియడ్స్ లో నొప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఈ ఎండ్రోమెట్రియోసిస్ గర్భాశయం లోపలే ఉంటుంది. ఈరోజుల్లో చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా గర్భంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. పిసిఒడి సమస్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారికి పీరియడ్స్ రెగ్యులర్గా రావు. కానీ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం కడుపులో విపరీతంగా నొప్పి అనేది వస్తుంది. ఇలా నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది. తగిన చికిత్స పొందవచ్చు.