ఎందుకంటే ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు సంభవించే లక్షణాలుగా పేర్కొంటున్నారు. అట్లనే కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. తెల్లటి మచ్చలు, క్రీమ్ వంటి పదార్థం ఎక్కువగా కనిపిస్తే అది ల్యుకోప్లాకియా వ్యాధికి దారితీస్తుందని, క్రమంగా క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నాలుక మీద చర్మం చిన్న ముళ్ల మాదిరిగా పెరగటం, చిన్నగా ఓ వరుస క్రమంలో వెంట్రుకలు పెరగటం వంటివి కూడా ప్రమాదకరమైన సంకేతాలే. ఇటువంటి లక్షణాలతో పాటు తెలుపు, నలుపు లేదా గోధుమ రంగులో కి మారితే ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగిందని చెప్పవచ్చు. అలాగే హానికరమైన బ్యాక్టీరియా వల్ల కూడా ఇలా జరుగుతుంది.
ఎలక్షన్ చేస్తే అది క్యాన్సర్ డెవలప్ కావటానికి దారితీయవచ్చు. కాబట్టి అనుమానం రాగానే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్. నాలుక రోజుల తరబడే సాధారణం కంటే ఎర్రగా మారడం లేదా పింక్ నుంచి స్కార్లెట్ కి మారితే దానిని ప్రమాద సంకేతం గా భావించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కవాసకి యాదికి సంబంధించిన లక్షణం కూడాను. దీంతో పాటు విటమిన్ల లోపం, పిల్లల్లో స్కార్లెట్ జ్వరం వల్ల కూడా నాలుక ఎర్రగా మారవచ్చు. పెద్దల్లో దీర్ఘకాలంగా నాలుక ఎర్రగా అనిపిస్తే క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి. దాదాపు నాలుక నల్లబడటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి లక్షణం కనిపించినప్పుడు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లు అయి ఉంటే కనుక వెంటనే అలర్ట్ అవ్వాలి.