ఒకప్పుడు ఏజ్ బార్ అయినా వారిలో కూడా దృష్టిలో పాలు పెద్దగా ఉండేవి కాదు. కానీ వీటి వల్ల చిన్న పిల్లల్లో సైతం కంటి చూపు మందగిస్తోంది. చూపులో అస్పష్టత, తలనొప్పి, కళ్లు పొడిబారటం, మంట, దురద వంటి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. అందుకు గల ప్రధాన కారణాల్లో డిజిటల్ ఐ స్ట్రెయిన్ ఒకటి అంటున్నారు కంటి వైద్య నిపుణులు. అంటే ... స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, డస్క్ టాప్ లు, కంప్యూటర్లు సహ వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను యూస్ చేస్తున్నప్పుడు దృష్టిని వాటిపైనే ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది ఇటీవల అనేకమందిని వేధిస్తున్న సాధారణ కంటి సమస్యగా మారిపోయింది. తరచుగా ఒకే పనిపై కళ్ళను కేంద్రీకరించినప్పుడు సంభవించే కంటే సమస్యను అసైనోషియా అంటారు. అయితే డిజిటల్ పరికరాలపై ఫోకస్ చేయటం కారణంగా కళ్ళపై ఏర్పడే ఒత్తిడి వల్ల తలెత్తే దృష్టిలోపాలను, సమస్యలను డిజిటల్ ఐ స్ట్రెయిన్ గా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తుంటారు. డిజిటల్ పరికరాలపై ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల కళ్ళలో మంట, దృష్టిలో పాలే కాదు, దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే తలనొప్పి, మైగ్రేన్ వంటివి పెరిగిపోతాయి.

 అలా జరగకూడదు అంటే పరికరమేదైనా స్క్రీన్ మీ ఐ లెవెల్ లో ఉండేలా చూసుకోవాలని, సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యలో ఎటువంటి బ్రేక్ కూడా తీసుకోకుండా స్క్రీన్ లకు బహిర్గతం కావటం వల్ల కూడా కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ కు ప్రధాన కారణం ఇదే. అయితే దీనిని తగ్గించడంలో 20-20-20 నియమం యూజబుల్ గా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే.. ప్రతి 20 నిమిషాల స్క్రీన్ వినియోగం తర్వాత 20 సెకన్ల విరామం తీసుకోవటం దీని ముఖ్య ఉద్దేశం. అట్లానే బ్రేక్ తీసుకున్నప్పుడు మీకు 20 అడుగుల దూరంలో ఉన్న చెట్టునో, ఇతర వస్తువులను చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: