చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. చియా గింజలు, నారింజ రెండిటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల నారింజ జ్యూస్ చియా గింజలతో కలిపి తాగటం వల్ల మలబద్ధకం నుండి ఉపశ్రమమం లభిస్తుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉన్నందున నారింజ చియా గింజలను డయాబెటిక్ రోగులు కూడా తమ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆరెంజ్ చియా గింజల జ్యూస్ తాగటం వల్ల రోగం పెట్టి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే నారింజ జియా గింజల జ్యూస్ తాగటం వల్ల చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ తాగటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నారింజ జ్యూస్ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ జ్యూస్ లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డైలీ ఉదయం పూట దీనిని తాగటం మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చియా సీడ్స్ నారింజ జ్యూస్ ని తప్పకుండా తాగండి.