అబ్బాయిలు నలుగురిలో ప్రవర్తించే తీరు వారి మనస్తత్వాన్ని ఇట్టే చెప్పేస్తాయి. ముఖ్యంగా మారు రోడ్డుపై నడిచేటప్పుడు వారి చేతుల కదలికలు, చూసే విధానం, బాడి లాంగ్వేజ్.. గమనించాలే గానీ వారితో పరిచయం లేకుండా వారెలాంటి వారో ఇట్టే చెప్పోచ్చు.. అలాంటి ఓ టెక్నిక్ ఇది.... సాధారణంగా జేబులో చేతులు పెట్టుకుని నడవడం మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఇది సాధారణ విషయం మాత్రమే కాదు.. దిని వెనుక చాలా అర్థాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఈ ప్రవర్తన మనకు పెద్ద విషయంగా అనిపించకపోయినా మానసిక, భావోద్వేగ స్థితికి దీనిని ఓ సంకేతంగా గుర్తిస్తారట.

అవును. మన ప్రతి కదలిక ఒక్కో సంకేతం పంపుతుంది. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులను కదుపుతున్న విధానం కూడా వారి అంతర్గత భావాలను ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు వీటిని ఆయా వ్యక్తుఉల గమనించకపోవచ్చు. ఈ రకమైన కదలికలు, సంజ్ఞలు అనేక రకాల భావోద్వేగాలు, వైఖరులను ఎదుటి వారికి తెలియజేస్తుంటాయి. ఇంతకి వాటర్ధం ఏమిటో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.. ఒక వ్యక్తి తన జేబులో చేతులు పెట్టుకుని నడిస్తే... అతడే పరధ్యానం లేకుండా చాలా అలర్ట్ గా ఉన్నాడని అర్ధం.

ఇది ఒక రకంగా ఇతరుల నుంచి దాక్కోవడం లాంటిది. ఈ సంజ్ఞ ప్రత్యేకించి వ్యక్తి సామాజికంగా అసురక్షితంగా భావించినప్పుడు ఈ విధంగా చేతులు దాచుకుంటాడు. ఇలా చేయడం వల్ల భద్రతా భావం ఏర్పడుతుంది. అంటే మానసికంగా టెన్షన్ ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు చేసిన ప్రయత్నమే ఇదని అంటున్నారు నిపుణులు. కొన్ని గందర్భాల్లో ఇది ఉదాసినత, నిష్క్రియాత్మకతను కూడా సూచిస్తుంది. ఈ భంగిమ అర్ధాలు పూర్తిగా వ్యక్తిగతం. వ్యక్తి వ్యక్తి పరస్పర చర్యను నివారించాలనే కోరిక కూడా కావచ్చు. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులను కదుపుతున్న విధానం కూడా వారి అంతర్గత భావాలను ప్రతిబింబిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: