మన రోజు వారి ఆహారంలో ముఖ్యమైనది రైస్. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అనేక ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించే ఆహారం. మీకు ఇంకో విషయం తెలుసా రైస్ వాటర్లో అనేక ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయి. ఈ నీటిని రోజువారీగా వాడటం ద్వారా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రైస్ వాటర్ లో ఇనోసిటాల్, ఫెరులిక్ ఆమ్లం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని నిరోధించి, ముందస్తు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. పైగా స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రైస్ వాటర్ తో ప్రతిరోజు ముఖాన్ని కడిగితే ముఖంపై ఉండే జిడ్డు, మురికిని తొలగిస్తుంది.
దీనిలో ఉన్న స్టార్చ్ చర్మాన్ని కడిగి, ఆరోగ్యకరమైన కాంతిని తీసుకొస్తుంది. ఈ వాటర్ లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ నీటిని తీసుకోవటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలసట తగ్గించి, శరీరానికి మళ్లీ శక్తిని పునరుద్ధరించడంలో ఇది సహాయపడుతుంది. రైస్ వాటర్ లో సహజ ఆక్షిజనేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ తల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఇన్ఫెక్షన్లు, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రైస్ వాటర్ శరీరానికి తక్షణ రీహైడ్రేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వేడి వాతావరణం, శరీర పనితీరు, అధిక శ్రమ లేదా మరికొన్ని కారణాలవల్ల మన శరీరంలో నీరుని కోల్పోతుంది.