రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే చాలా సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలిసిందే . మనం రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి చాలా న్యాచురల్ రెమెడీస్ కూడా వాడుతూ ఉంటాము . దేని గురించే తాజాగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు . సరైన ఆహారంతో పాటు జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అట . బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే టిప్స్ పై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం . అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది . రక్తంలో చక్కర స్థాయిలు తగ్గించగల ఆహారాన్ని తప్పక తీసుకోవాలి .

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చక్కరలను నియంత్రించడంలో సహాయపడతాయి . ఫైబర్ శరీరానికి చాలా ఉపయోగమైనది . ఇది రక్తంలో చక్కెర ప్రవాహాన్ని తగ్గించి గ్లూకోస్ శరీరానికి తక్కువగా అందేలా చేస్తుంది . ఎక్కువ కూరగాయలు మరియు పండులు, మొలకెత్తిన గింజలు వంటి వాటిని శరీరంలో చేర్చుకోవడం మంచిది . భోజనం తరువాత 15 నుంచి 30 నిమిషాల పాటు నడక చేయడం చాలా ఉత్తమం . ఇది రక్తంలో చక్రస్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది . నడక చేయడం వల్ల డయాబెటిస్ తగ్గుతాయి .

 గ్లాసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కర స్థాయిలను వేగంగా పెంచుతాయి . స్వీట్స్ మరియు షుగర్, సోడాలు మరియు కూల్ డ్రింక్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది . తక్కువ గ్లాస్మిక్ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి . గంటలకు వొది కూర్చుని ఉండడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు పెరగడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరే అవకాశం ఉంది . పనిచేయడం మధ్యలో చిన్నచిన్న బ్రేక్స్ తీసుకోవడం శరీరానికి మంచిది . నిద్రలేమి రక్త చక్కెర స్థాయిల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం . రోజుకు కనీసం ఏడు నుంచి 8 గంటల నిద్ర అవసరం . ఇది శరీరానికి తగినంత విశ్రాంతిని ఇస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: