భాష‌లు మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక‌లు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో భాష‌లు ఉన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష‌, ఒక్కో యాస‌. మ‌రి ఈ భాష‌ల్లో ఎక్కువ‌మంది మాట్లాడే భాష‌లు ఏవో తెలుసుకోవాల‌ని ఉందా.. అయితే ఇక్కడ ఓ లుక్ వేయండి..

1. ఇంగ్లీష్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భాష మాట్లాడేవాళ్లు 113 కోట్ల 20 ల‌క్ష‌లు. ఈ భాష ప్ర‌ధానంగా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెన‌డా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాట్లాడ‌తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపార‌, విద్యా రంగాల్లో దీనికి విశేష ప్రాధాన్యం ఉంది.

2. మాండరిన్ చైనీస్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భాష మాట్లాడేవాళ్లు: 111 కోట్ల 70 ల‌క్ష‌లు. ఈ భాష చైనాలో అత్య‌ధికంగా మాట్లాడుతారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మాట్లాడే మాతృభాష ఇది.

3. హిందీ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భాష మాట్లాడేవాళ్లు 61 కోట్ల 50 ల‌క్ష‌లు. భార‌త‌దేశంలో అత్య‌ధికంగా మాట్లాడే భాష‌ల్లో ఇది ప్ర‌ధాన‌మైన‌ది. హిందీ మ‌న దేశానికి అధికారిక భాష‌ల్లో ఒకటి.

4. స్పానిష్

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు 53 కోట్ల 40 ల‌క్ష‌లు. స్పెయిన్ తో పాటు లాటిన్ అమెరికాలోని చాలా దేశాల్లో ఈ భాషను మాట్లాడ‌తారు.

5. ఫ్రెంచ్

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు: 28 కోట్లు. ఫ్రాన్స్‌తో పాటు కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో కూడా ఈ భాషను ఉపయోగిస్తారు. ఇది అంతర్జాతీయ సంబంధాల‌లో ముఖ్య‌మైన భాష‌.

6. అరబిక్

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు: 27 కోట్ల 40 ల‌క్ష‌లు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ భాషను ఎక్కువగా మాట్లాడతారు. ఇది అనేక దేశాల అధికారిక భాష కూడా.

7. బెంగాలీ

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు 26 కోట్ల 50 ల‌క్ష‌లు. బంగ్లాదేశ్, భార‌త‌దేశంలోని ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ భాషను అధికంగా ఉపయోగిస్తారు.

8. రష్యన్

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు 25 కోట్ల 80 ల‌క్ష‌లు. రష్యాలో ప్రధానంగా మాట్లాడే భాష ఇది. పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల్లో కూడా దీనికి ప్రాధాన్యం ఉంది.

9. పోర్చుగీస్

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు 23 కోట్ల 40 ల‌క్ష‌లు. పోర్చుగల్‌తో పాటు బ్రెజిల్, అంగోలా, మొజాంబిక్ వంటి దేశాల్లో ఈ భాషను మాట్లాడుతారు.

10. ఇండోనేషియన్

వరల్డ్ వైడ్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్లు 19 కోట్ల 90 ల‌క్ష‌లు. ఇండోనేషియా దేశానికి ఇది అధికారిక భాష. ఆగ్నేయాసియా ప్రాంతంలో దీనికి ప్రాముఖ్యత ఉంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే.. మ‌న తెలుగు స్థానం ఎంతో తెలుసా..? ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య అక్ష‌రాలా 9 కోట్ల 60 ల‌క్ష‌లు. ఈ లెక్క‌న మ‌న తెలుగు జాబితాలో 15వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: