4 ఏళ్ల పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, శారీరక దారుఢ్యం కోసం చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఇంత తక్కువకు బరువు తగ్గానని అతను చెబుతున్నాడు. ఆయన పట్టుదల చూసి చాలామంది ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి మోటివేట్ అయిపోతున్నారు.
ఇటీవల అజహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "Pov: యూ గో ఆల్ ఔట్ !!" అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ వీడియోలో ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశారు. తాను 145 కేజీల బరువుతో ఉన్నప్పుడు తన శరీరంలో 55% కొవ్వు ఉండేదని చెప్పారు. కానీ యేండ్ల తరబడి చేసిన కఠోర శ్రమ, పట్టుదలతో ఇప్పుడు ఆ కొవ్వును కేవలం 9%కి తగ్గించుకోగలిగానని చెప్పాడు.
అయితే అజహర్ MTV రోడీస్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన మనసులోని మాటల్ని బయటపెట్టారు. తన తండ్రి మరణించినప్పుడు, ఆయన అంత్యక్రియల్లో తండ్రి భౌతికకాయాన్ని సైతం మోయలేని స్థితిలో ఉన్నానని.. ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పాడు. ఆ బాధతోనే తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు, తన తండ్రి ఒకసారి బరువు తగ్గమని ఛాలెంజ్ చేశారని, కేవలం ఏడు నెలల్లోనే 55 కేజీలు తగ్గి ఆయనకు సమాధానం చెప్పాననీ గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కూడా తన ప్రయాణాన్ని ఆపకుండా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.
అజహర్ కథ ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇన్స్‌పైర్ చేస్తుంది, కాగా ఫిట్‌నెస్ ట్రైనర్ అంబికా జైన్ 10 సులువైన హోమ్ వర్కౌట్స్ సూచించారు. ఈ వ్యాయామాలతో బరువు తగ్గడమే కాకుండా, ఫిట్‌గా కూడా ఉంటారు. ఆమె చెప్పిన వాటిలో ట్విస్టర్ జంప్స్, మౌంటెన్ క్లైంబర్స్, బర్డ్ డాగ్ పొజిషన్, సైడ్ క్రంచెస్ లాంటివిఉన్నాయి. ఇవి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా పనిచేస్తాయి.