చిన్నపిల్లలు, స్త్రీలలో రక్తహీనత సమస్యలు తరచుగా తలెత్తుతున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి మనం తినే ఆహారం ద్వారానే శరీరంలో రక్తం తయారవుతుంది. కాగా అందుకు అవసరమైన హిమోగ్లోబిన్ ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఒకవేళ తక్కువగా ఉంటే రోగ నిరోధక వ్యవస్థ పనిచేయదు. దీంతోపాటు వ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. అందుకే మీ రోజువారి డైట్లో శరీరంలో హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అయ్యేందుకు అవసరమైన ఆహారాలు చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

అవేంటో చూద్దాం. ఆకుకూరలు హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోకుండా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాలకూర, పాయల్ కూర, తోటకూర, బచ్చలి కూర అందుకు దోహదపడతాయి. వీటితో పాటు గ్రీన్ కలర్ లో ఉండే బ్రోకలీ, క్యాప్సికం కూడా హెమోలోబిన్ లెవెల్స్ పెంచుతాయి. వీటిలో విటమిన్ 12, విటమిన్ ఎ, సి, అలాగే మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఖర్జూరం, దానిమ్మ, అరటిపండు హిమోగ్లోబిన్ స్థాయిని పంచగలిగే అద్భుతమైన ఫలాలుగా ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.

దానిమ్మ వల్ల బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇక ఖర్జూరంలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉంటాయి కాబట్టి హిమోగ్లోబిన్ పెరుగుదలకు కారణం అవుతుంది. అరటి పండులో ఉండే ఐరన్, ఫైబర్ కంటెంట్ రోగ నిరోధక శక్తిని, హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతాయి. అలాగే బీట్ రూట్, ఉసిరి, నిమ్మ వంటివి కూడా ఎందుకు సహాయపడతాయి. కాబట్టి ఈ కూరలను తప్పకుండా తినాలి. ఇవి తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా పాలకూర, పాయల్ కూర, తోటకూర, బచ్చలి కూర అందుకు దోహదపడతాయి. వీటితో పాటు గ్రీన్ కలర్ లో ఉండే బ్రోకలీ, క్యాప్సికం కూడా హెమోలోబిన్ లెవెల్స్ పెంచుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: