ఎందుకంటే చక్కెరలో అంటే తియ్యటి ఆహారాలు, పానీయాలలో ఫ్రక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటి లివర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అట్లనే షుగర్ రిలేటెడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల అందులోని సుక్రోజ్ అండ్ ఫ్రక్టోజ్ సమ్మేళనాలు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. కాబట్టి వాటిని తగ్గించాలంటున్నారు నిపుణులు. ఇక డైట్లో షుగర్ తగ్గించడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చూస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా మీ రొటీన్ నుంచి షుగర్ ను తగ్గించడం వల్ల డైజ్ స్టివ్ హెల్త్ కూడా మెరుగు పడుతుంది.
క్యాలరీలు ఆటోమేటిగ్గా బర్న్ అవుతాయి. దీంతో బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధిక బరువు కూడా తగ్గుతారు. అధిక చక్కెరలు కలిగిన పదార్థాలు మానేయటం వల్ల ముఖంలో వృద్ధాప్య ఛాయలు, మొటిమలు వంటివి దూరం అవుతాయని. యంగెస్ట్ లుక్కు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అట్లనే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. దంతాలు పుచ్చిపోవటం, నోటి దుర్వాసన వంటివి రావు. స్ట్రెస్, యాంగ్జైటిస్, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.