ఏదో ఒక విషయంలో తరచుగా ఆందోళన వేధిస్తోంది? ప్రేమ, ఉత్సాహం, నమ్మకం, ఆసక్తి వంటివి తగ్గిన అనుభూతికి లోన్ అవుతున్నారా? పరధ్యానంలో ఉంటూ ప్రియమైన వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అతి ఆలోచనలతో అస్సలు విషయాలు మర్చిపోతున్నారా? అయితే మీలో లవ్ హార్మోన్ తగ్గి ఉండవచ్చు. ఎందుకంటే ఇది తగినంతగా ఉత్పత్తి కానపుడే చాలా మంది ఇలాంటి ప్రతికూల ప్రభావాలతో పోరాడుతుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి లవ్ హార్మోన్ గా పిలవబడే ఆక్సిటోసిన్ ఒక పెప్టైడ్ అండ్ న్యూరో పెప్టైడ్ హార్మోన్. ఇది మెదడులోని హైపోథామలస్ లో ఉత్పత్తి చేయబడి, పిట్యూటరి గ్రంధి ద్వారా విడుదలవుతుంది. సోషల్ బాండింగ్, అటాచ్ మైంట్స్ అండ్ రిలేషన్ షిప్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది తరచుగా ప్రేమ, నమ్మకం, ఆప్యాయత వంటి భావాలతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆక్సిటోసిన్ విడుదల సక్రమంగా ఉంటదో ఆ వ్యక్తి మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పరోక్షంగా ప్రేమ, ఆప్యాయతలు, అనుభవాలు వంటి అంశాల్లో ప్రతికూల భావాలతో పోరాడే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకుల ప్రకారం... ప్రస్తుతం అనేకమంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉత్పత్తి కాపటం ఒకటి. తద్వారా జీవితంలో ఇబ్బందులు, అనారోగ్యాలు వంటివి కూడా ఎదుర్కొంటున్నారు. అనుబంధాలు, భావోద్వేగాల నిర్వహణలో కీలకపాత్ర పోషించే లవ్ హార్మోన్ దీర్ఘకాలం పాటు సరిగ్గా ఉత్పత్తి కాకపోతే నేర్చుకునే సామర్థ్యం,

 జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మతిమరుపు, డెమెన్షియా, అల్జీయర్స్ వంటి రుగ్మతలను అడ్డుకోవటంలో ఇది కి రోల్ పోషిస్తుంది. ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ప్రేరేపించడం ద్వారా మానవులకు మేలు చేస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీస్, కోపం వంటివి తగ్గిస్తుంది. సామాజిక సంబంధాలను, వ్యక్తుల మధ్య అనుభవాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. శరీరంలో నొప్పి, బాబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందటంలో మేలు చేస్తుంది. వ్యక్తుల మధ్య నమ్మకాన్ని, సానుభూతిని పెంచుతుంది. అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండెకు, మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: