ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారు సంఖ్య ఎక్కువే. మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులను మనం గమనిస్తూనే ఉన్నాం. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి శరీరంలో కొవ్వు పేరు పోయేందుకు కారణంగా చెప్పవచ్చు. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతుంటాయి. ఈ అధిక బరువుతో బాధపడుతున్న వారు దానిని గుర్తించి బరువు తగ్గేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు. ఎలాగైనా బరువు తగ్గాలని తెగ ఆరాటపడతారు. ఆసుపత్రులకు కూడా వెళ్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, అలవాట్లతో సులువుగా బరువు తగ్గేందుకు వీలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వీటిని పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

చాలామందికి రాత్రి సమయాల్లో టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవారు భోజనం చేసిన కొంత సేపటి తర్వాత కెఫిన్ ఉందని హెర్బల్ టీ తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చమోమైల్, పుదీనా టీ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. ఇది మంచి నిద్రకు తోడ్పడతాయని చెబుతున్నారు. భోజనం చేశాక ఐస్ క్రీమ్ లు, ఇతర చక్కెర ఉండే పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటికి బదులు ఏదైనా పండ్లు వంటివి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. భోజన సమయానికి ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ ను ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కడైనా కుదురుగా కూర్చుని, దీర్ఘంగా శ్వాస తీసుకుని, మెల్లగా వదులుతూ ఉండాలని చెబుతున్నారు. ఇది శరీరంలో ఒత్తిడిని, హార్మోన్లను నియంతరిస్తుందని... అతిగా తినడాన్ని అడ్డుకుంటుందని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా 15 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుందని, శరీరంలో మెటాబాలిజం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం అనంతరం నడవటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని పేర్కొంటున్నారు. దీనివల్ల కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత ఫోన్, కంప్యూటర్, టీవీ ఇలా అన్ని రకాల స్క్రీన్ లకు దూరంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: