ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడానికి, నరాల పనితీరు, గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ, కిడ్నీ, కాలేయం, పేగుల ఆరోగ్యం కోసం అనేక విటమిన్లు, ఖనిజాలు, ఔషధ గుణాలను అందిస్తుంది. ఈ పండు ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక అద్భుతమైన ఔషధం అంటున్నారు వైద్య నిపుణులు. ఎర్రటి అరటి పండుని ఉదయం 6 గంటల సమయంలో తినాలి. ఈ సమయంలో జీర్ణక్రియ అనేది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను పూర్తిగా అంగీకరించి జరిగే స్థితిలో ఉంటుంది. ఉదయం ఈ పండును తినటం వల్ల శరీరానికి శక్తి, శాంతి, జీవ క్రియతో కూడిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. మరి ఇతర సమయాల్లో అంటే ఉదయం 11 గంటల సమయంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా తినొచ్చా అంటున్నారు నిపుణులు.
నరాలు బలహీనమైనప్పుడు శక్తి లోపం, నిస్పృహ వంటి సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి వారికి ప్రతిరోజు రాత్రి ఒక ఎర్రటి అరటిపండు తినటం ద్వారా నరాలు బలపడతాయి. దీన్ని 48 రోజుల పాటు కొనసాగిస్తే, నరాలు శక్తివంతంగా మారుతాయి. ఈ పండు కంటి చూపు సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది. కంటి చూపు మందగించడం ప్రారంభించిన వారి కోసం ఇది ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ప్రతిరోజు ఎర్రటి అరటిపండు తీసుకోవడం వల్ల గంటి చూపు క్లియర్ అవుతుంది. పంటి నొప్పి, పళ్ళ క్షిణత వంటి సమస్యలు ఉన్నవారికి ఈ అరటి పండు మేలు చేస్తుంది. పళ్ళ సమస్యలు ఉన్నవారు, 21 రోజుల పాటు ఈ అరటిపండు నిరంతరం తినటం ద్వారా పళ్ళు బలపడతాయి.