మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. మనం ఏ పని చేయాలన్నా ఇదే కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బాడీకి అందే ఆక్సిజన్ లో, ఎనర్జీలో దాదాపు 20 శాతం మన బ్రెయిన్ ని ఉపయోగించుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇలా జరిగినప్పుడే మనం యాక్టివ్గా వర్క్ చేయగలుగుతాము. అయితే కొన్నిసార్లు సరైన ఆహారం తీసుకోకపోవటంవల్లో, అధిక పని ఒత్తిడివల్లో, వయసు రీత్యా సంభవించే శారీరక మార్పులవల్లో మెదడు పనితీరులు తాత్కాలిక మార్పులు సంభవిస్తుంటాయి. కొన్నిసార్లు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటివి తగ్గుతుంటాయి. మెదడు ఎల్లప్పుడూ పాదరసంలా పని చేయాలంటే పాటించదగిన కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

మెదడు కంప్యూటర్లో పనిచేయాలంటే... నిరంతరం ఏదో ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని అధిక ఒత్తిడి సందర్భాల్లోనూ ఇలా చేయకూడదు. మీరు ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాలను నేర్చుకోవడం పై ఫోకస్ చేయాలి. కొత్త పుస్తకం చదవటం, కొత్త భాష నేర్చుకోవటం, సమస్యలకు పరిష్కారాలను ఆలోచించడం ఇలా ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుందని, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అట్లనే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి.

రోజు సరిపడా మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. నిజానికి క్వాలిటి స్లీప్ మన బ్రెయిన్ ఎనర్జీని రీఛార్జ్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు కంటి నిండా నిద్రపోయేనప్పుడే మెదడు పాదరసం కంటే వేగంగా, చురుగ్గా పనిచేస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలు యాక్టివ్ గా పని చేయడం ప్రారంభిస్తాయి. మీరు తీసుకునే ఆహారం కూడా మెదడు ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అధిక కొవ్వులు కలిగినవి, నూనెలో అధికంగా వేయించినవి, బేకరీల్లో నిల్వ ఉంచినవి ఇలా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ పోషకాలు కలిగిన ఆహారాలకు ఎక్కువ కాలం పాటు దూరంగా ఉంటే మెదడు పనితీరు మొద్దు బారుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: