నల్ల ద్రాక్షాలోని ఆంటీ ఆక్సిడెంట్ మంట చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నల్ల ద్రాక్షలో విటమిన్ సి ఎక్కువగా గా ఉంటుంది. ఇది మనలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు దూరం చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి, బోలు ఎముకల సమస్య రాకుండా చేస్తుంది. అంతేకాదు... ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకు క్యాన్సర్ తగ్గుతుంది. నల్ల ద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటే ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లాం వంటి ప్రమాదాలు దూరంఅవుతాయి.
నల్ల ద్రాక్షాలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాన్ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్టాక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవటం మంచిది. వీటిలో డైటరి ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ఆరోగ్యంగా మార్చుతుంది. ఎండిన నల్ల ద్రాక్ష తింటే మలబద్దకం దూరం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నల్ల ద్రాక్ష తినటం మంచిది. ఇందులో అతి తక్కువ కేలరీలు, ఫైబర్ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. నల్ల ద్రాక్షాలు సహజ చక్కెరలు ఉండటం వల్ల మధుమేహం బాధితులకు మంచి పండుగ నిపుణులు చెబుతున్నారు.