ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిని బంధిస్తోంది. మనదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఏర్పడే సమస్య. హార్మోన్ల అధికంగా లేదా తక్కువగా ఉత్పత్తి కావడంతో బరువు పెరగటం, జుట్టు రాలటం, అలసట, ఇతర శారీరక సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని సహజ ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంధి పనితీరును పెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ గ్రంధి మెడ భాగంలో ఉంది. ఇది శరీర శక్తిని వినియోగించడం, మెదడు, గుండె, ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయడం కోసం హార్మోన్లను విడుదల చేస్తోంది.
కానీ ఈ గ్రంధిలో అసమ తూల్యత ఏర్పడితే హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిజం వంటి సమస్యలు వస్తాయి. హైపర్ థైరాయిడిజంలో హార్మోన్ల అధికంగా విడుదల అవుతాయి. ఇది గుండె దడ, బరువు తగ్గటం, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలకు దారితీస్తుంది. హైపో థైరాయిడిజంలో హార్మోన్ లా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల బరువు పెరగటం, నీరసంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఉసిరిలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంతరించడంలో సహాయపడుతుంది. ఉసిరిని పచ్చడి, తేనెతో కలిపి తీసుకోవడం మంచిది.