ఈ సమస్య నుంచి ఉపశ్రమమం పొందేందుకు నిపుణులు కొన్ని ఆహార అలవాట్లలో మార్పులు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. పసుపు అనేది ప్రతి భారతీయ వంటకానికి ముఖ్యమైన పదార్థం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటంతో శరీరంలో జ్వరం, బాపులను తగ్గిస్తుంది. పసుపు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వల్ల మోనోపోజ్ సమయంలో ఎదురయ్యే వేడి ఆవిర్లకు ఉపశమణం పొందవచ్చు. గ్రీన్ టీ మన శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇది కేవలం క్యాన్సర్ నుంచి రక్షించడమే కాకుండా శారీరక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మోనోపాజ్ సమయంలో గ్రీన్ టీ తరచుగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మోనోపోస్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గటం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది.
అందుకే కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, చీజ్, సోయా, ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అదనంగా బ్రోకోలి, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు వేడి ఆవిర్లను తగ్గించడంలో సహాయపడతాయి. మోనోపాజ్ సమయంలో ఐరన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, నట్స్ వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. అయితే కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని విధంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. కారం ఎక్కువగా ఉండే ఆహారాలు, కెఫీన్, చక్కెర, పిండి పదార్థాలు, ఉప్పులను మితంగా తీసుకోవడం అవసరం. బదులుగా రోజుకు ఎక్కువగా నీరు తాగటం మంచిది. నగరానికి కనీసం కొన్ని రోజులు వ్యాయామం చేయడం ద్వారా మోనోపాజ్ లక్షణాలను అధిగమించవచ్చు. వ్యాయామం కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పద్ధతులను పాటించడం ద్వారా మోనోపోజ్ దశను ఆరోగ్యంగా, సులభంగా దాటేయవచ్చు. మీరు కూడా ఈ జీవన శైలిలో ఈ మార్పులను పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందండి.