అప్పట్లో అవసరమైనప్పుడు వాటిని కోసి వంటల్లో ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇళ్లల్లో మొక్కలు పెంచడం చాలా అరుదైపోయింది. కరివేపాకు వంటి ఉపయోగతకరమైన నాకు కూరను కూడా మార్కెట్ నుంచి కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరివేపాకు ప్రతి వంటకానికి రుచి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఎక్కువ మొత్తంలో కరివేపాకు కొన్ని తెచ్చినప్పుడు, కొన్ని రోజులకే అవి చెడిపోతాయి. ఈ సమస్యకు కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకును ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి వంటనూనెను ఉపయోగించడం ఉత్తమమైన మార్గం.
ముందుగా కరివేపాకును బాగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసి కొంచెం వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత ఎండబెట్టిన కరివేపాకుల్ని వేయించండి. ఆ తర్వాత ఒక పాత్రలో లేదా గాజు సీసాలో కరివేపాకుల్ని స్టోర్ చేయండి. కరివేపాకులో నూనె ఉండటం వల్ల అవి ఎండిపోవు. ఎప్పుడైనా సులభంగా వాడుకోవాలంటే కరివేపాకును పొడిగా చేసుకోవచ్చు. ముందుగా ఆకులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. అవి బాగా ఎండిన తర్వాత మిక్స్ లేదా గ్రైండర్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవచ్చు. ఈ పొడిని గాలి చొరబడని గాజు పాత్రలో నిలువ చేస్తే, ఎంతకాలం అయినా పాడవదు. ఈ పరిస్థితి వలన వంటకాలకు కరివేపాకుతో ఇచ్చే సహజ రుచి అతి సులభంగా పొందవచ్చు.