దీంతో ఎలాంటి వ్యాధులు, రోగాలను అయినా తట్టుకునే శక్తి వస్తుంది. ఇలా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరింత బటర్ వేసి మష్రూమ్స్ వేసి కలర్ మారేంతవరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి తరుగు, క్యారెట్ తరుగు,
స్పింగ్ ఆనియన్స్ వేసి అంతా ఓ 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాము లేదంటే వాము పేస్ట్ వేసి మొత్తం కలపాలి. ఇవన్నీ వేగాక నీటిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి అంతా కలపాలి. సూప్ దగ్గర పడుతున్న సమయంలో కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టేస్టీ మష్రూమ్ సూప్ సిద్ధం. ఈ చలికాలంలో వేడివేడిగా తాగితే భలే రుచిగా ఉంటుంది. జలుబు లేదా దగ్గు లాంటి సమస్యలు ఉన్నవారు ఈ మష్రూమ్ సూప్ ని తప్పకుండా తాగండి. ఇలా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి.