రుచి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఖుస్కా తిన్నవాళ్లకు... ఈ పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఏదైనా రుచిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బిర్యానీని తప్పకుండా తినండి. ఈ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాస్మతి రైస్ ని ముందుగా తీసుకుని నీళ్లలో నానబెట్టుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకుని... అందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత సోంపు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి.
ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చి వాసన పోయాక పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి మళ్లీ ఓ రెండు నిమిషాలు వేయించాలి. మసాలాలు కూడా వేగాక... టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు, కొత్తిమీర తరుగు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఖుస్కా బిర్యానీ సిద్ధం. ఈ రైస్ ప్లెయిన్ గా తినేయవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.