దొండకాయ తినడం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయలలో విటమిన్ సి,విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవటం వల్ల ఎముకలు బలపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. మీ ఎముకలు బలహీనంగా ఉంటే, మీరు దొండకాయ తినటం అలవాటు చేసుకోవచ్చు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారికి కూడా దొండకాయ అద్భుతమైనది. మధుమేహంతో బాధపడే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి అజాగ్రత్త వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయటం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. డయాబెటిక్ రోగులకు కొన్ని కూరగాయల వినియోగం చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. అలాంటి వారిలో దొండకాయ ఒకటి. ఈ కూరగాయ మధుమేహ ఓగులకు అమృతం లాంటిది అంటున్నారు నిపుణులు. దొండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధులనుండి ఉపష్టమనం కలిగిస్తాయి. దొండకాయ రక్తంలో చక్కెరను నియంతరిస్తుంది.

మధుమేహాన్ని నియంతరించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కూరగాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటుంది. దొండకాయ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఇది ఫైబర్ మంచి మూలం. దొండకాయ తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు.. దొండకాయ గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దొండకాయ కూడా తినొచ్చు. దొండకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. చర్మ సమస్య తామర నుండి ఉపశమనం పొందడంలో ప్రభావంతం గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: