శీతాకాలంలో వీచే చల్లని గాలుల కారణంగా ముఖంలోని తేమను పీల్చి చర్మాన్ని నిర్జివంగా మారుస్తుంది. దీనిని నుంచి తప్పించుకోవటానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, లోషన్లు వాడుతూ ఉంటారు చాలామంది. బంగాళదుంపలు ప్రతి ఇంట్లో తప్పక అందుబాటులో ఉంటాయి. బంగాళదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం లో ఉన్న నలుపుదనం తొలగిపోతుంది. దీనికోసం ముందుగా బంగాళాదుంపను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దాని నుంచి రసాన్ని తీయాలి. ఆ తర్వాత, ఈ రసాన్ని కాటన్ తో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. టమాటా రసం కూడా సౌందర్య సాధానంగా పనిచేస్తుంది.
మొఖం రంగును మెరుగుపరచడంలో టమాటా రసం మ్యాజిక్లా పనిచేస్తుంది. ఈ రసం పొడి చర్మం సమస్యను అధిగామించడానికి సహాయపడుతుంది. టమాటా రసం తయారు చేయడానికి ముందుగా టమాటాలను తురిమి దానే రసాన్ని తీయాలి. ఆ తర్వాత ఈ రసాన్ని వేళ్లు లేదా దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత, సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. టమాటాలలో ఉన్న విటమిన్ సి చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తో ముఖం రంగును మెరుగు పరుచుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మం మీద నలుపుదలాన్ని ఇట్టే తగ్గిస్తుంది. ముల్తానీ మట్టిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటి ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి.