ఆకలిని తగ్గించే కొన్ని రకాల ఫుడ్స్ ని మీ డైట్ లో యాడ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ మనకు ఈజీగా లభించే ఆహారాలే. కాబట్టి పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. కానీ ఏ సమయానికి ఏం తినాలో ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. బరువు తగ్గించే ఫుడ్స్ లో టిఫిన్స్ కూడా ఉన్నాయి. దోస, ఇడ్లీ వంటివి తినటం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. పైడ్ రైస్ మిలిట్ తగ్గించి... సైడ్ కూరలు, సలాడ్స్ తినండి. ఆకు కూరలను యాడ్ చేసుకోండి. వీటిల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి..
కొద్దిగా తిన్న పొట్ట ఫుల్ అవుతుంది. శరీరానికి శక్తి కూడా వస్తుంది. ప్రతి రోజూ కోడిగుడ్డు ఉడికించి లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకోండి. సలాడ్స్ లో ఎగ్ యాడ్ చేసి... బ్రేక్ ఫాస్ట్ లేదా డిన్నర్ లో తినోచ్చు. స్ట్రాబెరీలు, బ్లూబెర్రీలు, బనానా, ఉడికించిన పీనట్స్, వెయించిన శనగలను స్నాక్స్ గా తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగిన పొట్ట నిండుతుంది. అలాగే సూప్లో ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని తాగాలి. మీకు దొరికిన సమయంలో పావు గంట వాకింగ్ చేసిన చాలు. ఈజీగానే వెయిట్ లాస్ అవ్వచ్చు.