ఇలా రెండు రకాలుగా ఉంటాయి. అయితే వీటిల్లో ఏది ఆరోగ్యానికి మీరు చేస్తుందో చాలా మందికి తెలియదు. నల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావంతో రుచికి కారంగా ఉంటాయి. కానీ తెల్ల మిరియాలు నల్ల మిరియాలు కంటే తేలికపాటి, రుచి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇందులో కారం అంతగా ఉండదు. అందుకే వీటిని క్రీములు, సూప్ లు, వైట్ సాస్ లు వంటి తేలికపాటి వంటకాలకు ఉపయోగిస్తారు. నల్ల మిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు నుంచి తొలగిస్తారు. వీటిని ఎండలో ఎండబెట్టి నిల్వ చేస్తారు. వాటి బయటికి చర్మం నల్లగా, ముడతలు పడి ఉంటుంది. ఈ ప్రక్రియ దాని రుచిని తీవ్రతరం చేస్తుంది షూటు వాసనను ఇస్తుంది.
తెల్ల మిరియాలు పూర్తిగా ఎండిన ఎర్ర మిరియాలు. వీటిని నీటిలో నానబెట్టి వాటి బయటి తొక్కలను తొలగిస్తారు. తర్వాత మిగిలిన విత్తనాన్ని ఎండబెట్టాలి. ఇది వదువైన ఆకృతిని, సునీతమైన వాసనను ఇస్తుంది. నల్ల, తెల్ల మిరియాలు రెండిటిని ఒకే చెట్టు నుంచి సేకరించిన ఈ విధమైన ప్రక్రియ వల్ల నల్లగా, తెల్లగా కనిపిస్తాయి. అలాగే రుచి కూడా భిన్నంగా ఉంటుంది. మల్ల మిరియాలు ముదురు రంగులో ముడతలు పడిన బాహ్యా బాగానే కలిగి ఉంటాయి. వాటి రంగు కారణంగా సులభంగా గుర్తించబడతాయి. తెల్ల మిరియాలు మృదువైన, లేత ఉపరితలం కలిగి ఉంటాయి. నల్ల మిరియాలు వంట చేయడానికి సరైనది. దీన్ని ఉపయోగించడం వల్ల వంటల రుచిని పెంచుకోవచ్చు. గరం మసాలా తయారీలో ఉపయోగించే ప్రధాన మృగంధ ద్రవ్యాలలో ఇది కూడా ఒకటి.