కీర దోసతో చాలా రకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక చిన్న కీరదోస ముక్క తిన్న స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. ఎక్కువగా చాలామంది కీర దోసతో చేసే లస్సి తాగుతూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వింటర్ సీజన్లో తాగటం వల్ల చర్మం పగలకుండా, తేమగా కాంతివంతంగా మారుతుంది. కీర దోస ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఎండ నుంచి ఉపశ్రమణాన్ని ఇస్తుంది.

కిరా దోసతో చాలా రకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక చిన్న కీరదోస ముక్క తిన్న స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. కీర దోసని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా కట్ చేయాలి. ఇవన్నీ మిక్స్ లో వేసుకోవాలి.

 ఇందులోనే పెరుగు, కొద్దిగా నల్ల ఉప్పు, ఇంగువ, మిరియాల పోడి, చక్కెర వేయాలి. కావాలి అనుకున్న వాళ్లు ఐస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా అయ్యేలా అంతా మిక్సీ పట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కీరదోస లెస్సి సిద్ధం. చలికాలంలో ఐస్ క్యూబ్స్ వేసుకోకుండా తులసి తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇది తాగటం వల్ల మీకున్న సమస్యలు కూడా ఇట్టే దూరం అవుతాయి. బాగా వేడి చేసిన వాళ్లు ఈ లస్సీని తాగటం వల్ల తక్షణమే వేడి తగ్గిస్తుంది. రోజుకొకసారి అయినా ఈ లస్సిని తాగాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: