షుగర్ పేషంట్లలో అయితే ఎక్కువ ఆకలి షుగర్ పెరగటానికి మారడం అది నిపుణులు చెబుతున్నారు. కానీ ఏ సమస్య లేని వారిలో మితిమీరిన ఆకలి లక్షణాలు కనిపిస్తుంటే షుగర్ నిర్ధారిత టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే శరీరంలో టైప్-2 డయాబెటిస్ ప్రారంభమైతే మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు లేదా గ్లూకోస్ లెవెల్స్ పెరిగిన... తగిన మితిమీరిన ఆకలి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు దాహం కూడా అధికంగా వేస్తుంది. తరచుగా యూరిన్ కి వెళుతూ ఉంటారు.
గ్లూకోస్ లెవెల్స్ క్రాష్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్లు, చేతులు చమటలు పట్టడం, కళ్ళు తిరగటం వంటి లక్షణాలు ఎక్కువ గా కనిపిస్తాయి. దేనిపైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోవటం, గందరగోళం, టెన్షన్ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొంతకాలంగా అలాగే కొనసాగుతుంటే... జుట్టు రాలటం, మహిళల్లో అయితే ముఖంపై వెంట్రుకలు పెరగటం వంటివి ప్రారంభిస్తాయి. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ఉత్తమం. లేకపోతే శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా యూజ్ చేసుకోలేక పోవటం వల్ల ఇతర ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. నిర్లక్ష్యం చేయటం వల్ల మూత్రపిండాలు, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు దారితీయవచ్చు.