ముఖ్యంగా టీ విషయంలో అశ్రద్దగా ఉంటున్నారు. టీ ని ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ తమ ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నారు. మన ఇళ్లల్లో ఒక్కసారి చేసిన టిని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతూ ఉంటారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తరచుగా వేడి టీ తాగటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టాలు అంతా ఇంతా కావు. టీ ని పదేపదే వేడి చేసి తాగటం వల్ల టేస్ట్ మారుతుంది. బాడీలో కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా సువాసన కూడా పోయి దానిలోని పోషకాలు మొత్తం తగ్గుతాయి.
కాబట్టి ఒక్కసారి తయారు చేసిన టీ ని వెంటనే తాగాలి. లేదంటే వేడి చేసుకుని మాత్రం అసలు తాగకూడదు. పదేపదే వేడి చేసిన టీ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా, సూక్ష్మజీవులు పెరగటం ప్రారంభిస్తాయి. టీ బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం. దీని ఇంట్లో తయారు చేయడానికి ఎక్కువ పాలు అవసరమవుతాయి. ఇది సూక్ష్మజీవులను పెంచుతుంది. కాబట్టి టీ ని ఎక్కువగా తాగకండి. ఒక్కసారి పెట్టుకున్న టీ ని మళ్లీమళ్లీ వేడి చేసి మాత్రం తాగకండి. నిపుణులు చెప్పిన దాని ప్రకారం టీ ని మళ్లీమళ్లీ వేడి చేసి తాగటం వల్ల పోషకాలు పూర్తిగా నాశనం అవుతాయి. ఎలాంటి టీ ని తాగటం వల్ల కడుపునొప్పి పొట్ట సంబంధిత సమస్యలు దరిచేరుతాయి.