సక్సెస్‌ఫుల్ పీపుల్ డైలీ రొటీన్ లైఫ్ ప‌రిశీలిస్తే వీరిలో ఎక్కువ మందికి ఉద‌యం 3 - 5 గంట‌ల మ‌ధ్య‌లోనే లేచే అల‌వాటు ఉంటుంది. ఈ టైంలో నిద్ర లేచి రోజు మొద‌లు పెడితే ఎంతో ప్రొడ‌క్టివిటీ ఉంటుంద‌ట‌. భారతీయ పురాణాలు సైతం ఈ సమయంలో నిద్రలేవాలని ... అలాంటి వారే జీవితంలో స‌క్సెస్ అవుతార‌ని చెపుతున్నాయి. ఈ టైమ్ పీరియడ్‌ను ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. తెల్ల‌వారు ఝామున‌ 3 గంటల నుంచి 5 గంటల మధ్య వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శబ్దాలు కూడా వినిపించ‌వు.. వాతావ‌ర‌ణంతో పాటు మ‌న‌సు అంతా చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది.


అందుకే మ‌న‌సు హాయిగా తేలిక‌గా ఉంటుంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రు ఇదే టైం లో మెడిటేషన్, ఇతర ఆధ్యాత్మిక సాధనలకు ఇదే సరైన సమయం గా ఎంచుకుని ధ్యానం .. పూజ‌లు చేస్తూ ఉంటారు. ఈ టైంలో ధ్యానం చేస్తే ఏకాగ్ర‌త చాలా వ‌ర‌కు పెరుగుతుంద‌ట‌. ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఎన‌ర్జీ చాలా బాగుంటుంద‌ని.. అందుకే దేవుడి పూజ‌లు.. ప్రార్థ‌న‌ల్లో మ‌న‌సు స‌రిగా ల‌గ్నం చేసేందుకు ఇదే స‌రైన టైం గా చెపుతుంటారు.


ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తే ఎమోష‌న్లు బాగా కంట్రోల్ లో ఉంటాయ‌ట‌. ఈ టైంలో చేసే ప‌నులు కూడా ఎమోష‌న‌ల్  బ్యాలెన్స్ ను బాగా మెరుగు ప‌రుస్తాయ‌ట‌.ఈ టైంలో నిద్ర లేస్తే మ‌నిషి లో ఉన్న జీవ గడియారం మెరుగ్గా పనిచేస్తుంది. ఈ అల‌వాటు నిద్ర నాణ్యతను పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ టైంలో శ‌రీరం లోని విష వ్యర్థాలు, మలినాలు త్వరగా తొలగిపోవడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఉదయం లేచి గోరువెచ్చని నీరు తాగితే బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఇది క్ర‌మ శిక్ష‌ణ తో కూడిన జీవిన విధానాన్ని అల‌వాటు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: