గాడ నిద్రలో అలారం ఎక్కువగా మూగటం వల్ల నిద్ర నుంచి మేలుకుంటారు. ఎప్పుడో ఒక్కసారి అయితే పర్లేదు. కానీ రోజు ఇలా అలారం పెట్టుకుని పడుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గుండెకి కూడా మంచిది కాదు. అంతేకాకుండా అలారం శబ్దాన్ని ఆకస్మిక మేల్కొలు మానసిక స్థితిలో మార్పునకు, అధిక రక్త పోటుకు కారణం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జినియాకు చెందిన పరిశోధకుల అధ్యాయనంలో వెళ్లడైంది. మంచి నిద్రలో ఉన్నప్పుడు అలారం అకస్మాత్తుగా మోగటం వల్ల అకస్మాత్తుగా నిద్రమేల్కోంటాం. ఈ అప్పుడు శరీరం స్ట్రగ్గుల్ రియాక్షన్కు గురవుతుంది.
తక్షణ బెదిరింపులు, అపదలు, ఆకస్మిక పరిస్థితులను ఎదురుకోవటానికి ఈ హార్మోన్లు ముఖ్యమే అయినప్పటికీ, అవి మన శరీరాన్ని నిద్ర నుంచి మేల్కొలపడానికి రూపొందినవి కావని పరిశోధకులు అంటున్నారు. నిద్రకు భంగం కలిగించడం ద్వారా ఆందోళన, చికాకు, తలనొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించాలంటున్నారు నిపుణులు. అకస్మాత్తుగా లేపే అలారాలకు బదులుగా మీ మొబైల్ ఫోన్లలో స్మూత్ గా ఉండే స్నూజ్ ఎంపికను ఉపయోగించవచ్చు. లేటుగా కాకుండా త్వరగా పడుకోవటం, త్వరగా లేవటం అలవాటు చేసుకోవాలి. పడుకునేటప్పుడు త్వరగా పడుకుని లెగిసేటప్పుడు త్వరగా లేవటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఉదయం త్వరగా లేవటం అలవాటు చేసుకోండి. ఎప్పుడో ఒక్కసారి అయితే పర్లేదు. కానీ రోజు ఇలా అలారం పెట్టుకుని పడుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.