ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుల్ని సంప్రదించండి. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ నోడ్యూల్స్, థైరాయిడ్ క్యాన్సర్, హైపోథైరాయిడిజం, గాయిటర్ విస్తరించిన థైరాయిడ్, వంటివి థైరాయిడ్ వ్యాధి రకాలు. థైరాయిడ్ గ్రంధి అసాధారణగా పెరిగి ముద్దు లేదా నాడ్యూల్ గా మారటం కూడా థైరాయిడ్ వ్యాధికి కారణమని నిపుణులు చెబుతుండటం చూస్తూనే ఉంటాను. థైరాయిడ్ వ్యాధి వల్ల శక్తి స్థాయి, మానసిక స్థితి పై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. అయితే థైరాయిడ్ ఎక్కువగా మహిళలకే వస్తుంది. మరి పురుషుల్లో థైరాయిడ్ ఎంతవరకు ఉండాలి...? అనే దానిపై తాజాగా నిపుణులు వెల్లడించారు.
నిపుణుల్లో TSH యొక్క సాధారణ స్థాయి 0.4 mu/L నుంచి 4.0 Mu/L వరకు.. అలాగే 18-50 మగవారిలో TSH లెవెల్ 0.5- 4.1 Mu/L మధ్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 51 నుంచి 70 పురుషులలో, TSH స్థాయిలు 0.5-4.5 MU/L మధ్య ఉండాలి. అలాగే 70 సంవత్సరాలు పైబడిన మగవారిలో TSH స్థాయిలు 0.4- 5.2 MU/L ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈ వ్యాధి ఉన్నవారు తక్షణమే వైద్యుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలని తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు కచ్చితంగా డైట్ ని ఫాలో అవ్వాలి. ఈ డైట్ నీ ఫాలో అయితే తక్షణమే థైరాయిడ్ నుంచి ఉపశ్రమాన్ని పొందవచ్చు.