చాలామంది బొప్పాయి పండుని ఇష్టంగా తింటారు. మరి కొంతమందికి మాత్రం బొప్పాయి పండు అంటే అసలు ఇష్టం ఉండదు. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బొప్పాయి పండుని అసలు తినకూడదు. మిగతా ఎవరైనా కానీ బొప్పాయిని తినవచ్చు. బొప్పాయిలో రోగ నిరోధక శక్తిని నియంత్రించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలంటే రోజు తీసుకునే ఆహారం కూడా సరిగ్గా ఉండాలి. సాధారణంగా కూరగాయలు, పండ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలో కొన్ని పనులు ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.
ఇటువంటి వాటిల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. బొప్పాయిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆమ్లాత్వం, గ్యాస్, మలబద్ద కానీ నియంతరించడంలో సహాయపడుతుంది. బొప్పాయి లో ఉండే డైజెస్టివ్ ఎంజాయ్లు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బొప్పాయిలో పొటాషియం, ఇతర పోషకాలు అధికంటా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంతరించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాబట్టి డైలీ బొప్పాయిని తప్పకుండా తినండి. బొప్పాయిలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్ నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ డైవర్టికులిటిస్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన పేగులకు మేలు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ కె, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.