మీరు ఎప్పుడైనా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులను గమనించారా, డొనాల్డ్ ట్రంప్ నుంచి నరేంద్ర మోదీ వరకు, ఎలాన్ మస్క్ నుంచి వ్లాదిమిర్ పుతిన్ వరకు చాలామంది ఒక ప్రత్యేకమైన హస్త ముద్రను తరచుగా ఉపయోగిస్తారు. టీవీలో ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో వారిని గమనించి ఉంటే, వారి చేతులు కడుపు ముందు ఒక రాంబస్ ఆకారంలో ఉంటాయి. దీనినే 'హాకిని ముద్ర' లేదా 'మెర్కెల్ రాంబస్' అంటారు.

ఈ ముద్ర చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ దీని వెనుక ఉన్న శక్తి అపారమైనది. హాకిని ముద్ర ప్రధానంగా ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సాధారణ సమస్యలు. వీటిని జయించడానికి హాకిని ముద్ర ఒక అద్భుతమైన సహజ మార్గం.

మన మెదడు ఎడమ, కుడి అనే రెండు భాగాలుగా డివైడయ్యి ఉంటుంది  ఎడమ భాగం లాజికల్ ఆలోచనలు, విశ్లేషణ, భాషకు సంబంధించినది. కుడి భాగం సృజనాత్మకత, భావోద్వేగాలు, ఊహలకు సంబంధించినది. హాకిని ముద్ర వేసినప్పుడు, మన చేతి వేళ్ల కొనలు ఒకదానితో ఒకటి స్పర్శించడం వల్ల ఈ రెండు మెదడు భాగాలు సమన్వయం చెందుతాయి. ఇది ఆలోచనలను స్పష్టంగా చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

హాకిని ముద్రను కేవలం ఒక చేతి ముద్రగా మాత్రమే చూడకూడదు. ఇది ఒక టెక్నిక్. దీన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళనగా లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు, వెంటనే హాకిని ముద్ర వేస్తే కొన్ని నిమిషాల్లోనే తేడాను గమనించవచ్చు.

మెర్కెల్ రాంబస్ అనే పేరు జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి వచ్చింది. ఆమె ఈ ముద్రను చాలా తరచుగా ఉపయోగించడం వల్లే ఇది ప్రపంచవ్యాప్తంగా 'మెర్కెల్ రాంబస్'గా కూడా పాపులరైంది. ప్రపంచ నాయకురాలు అంతర్జాతీయ వేదికలపై ఇంత నమ్మకంగా కనిపించడానికి ఈ ముద్ర కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

* ఎలా వేయాలి

హాకిని ముద్ర వేయడం చాలా సులభం. సౌకర్యవంతంగా కూర్చోండి లేదా నిలబడండి. చేతులను మీ కడుపు ముందు తీసుకురావాలి. చేతి వేళ్ల కొనలను ఒకదానితో ఒకటి కలపాలి. బొటనవేళ్లు, చూపుడు వేళ్లు, మధ్య వేళ్లు, ఉంగరం వేళ్లు, చిటికెన వేళ్లు అన్నింటినీ కలపాలి. చేతులు రాంబస్ ఆకారంలో ఉంటాయి. కళ్లు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టాలి. కొన్ని నిమిషాల పాటు ఈ ముద్రలో ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: