చాలామంది టమాటాలను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరికొంతమందికి మాత్రం టమాటాలు అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ టమాటాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కూరల రుచిని పెంచే ఈ టమాటాలను కొన్ని రకాల కూరల్లో వేయకూడదన్న ముచ్చట నీకు తెలుసా? ఈ కూరల్లో గనుక మీరు టమాటాలను వేస్తే ఆ కర్రీ టేస్ట్ మొత్తం మారుతుంది. అందుకే ఏయే కూరల్లో టమాటాలను వెయ్యకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఎన్నో రకాల ఆకుకూరలు దొరుకుతుంటాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలి కూర, మెంతికూర వంటి ఆకుకూరలు ప్రతి మార్కెట్లో దొరుకుతాయి.

 కానీ ఆకు కూరల్లో టమాటాలను మాత్రం వెయ్యకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు. టమాటాలను వేయడం వల్ల వాటి రుచి చెడిపోతుంది. నిజానికి ఆకుకూరలను ఉడికించేటప్పుడు చాలా నీటిని విడుదల చేస్తాయి. కాబట్టి ఆకు కూరల్లో వేయడం అంత మంచిది కాదు. గుమ్మడికాయ కూరలో కూడా టమాటాలని వాడరు. అయితే గుమ్మడికాయ కూరగాయను కొద్దిగా పుల్లగా, తీయగా చేస్తారు. కాబట్టి ఈ ఆహారాల్లో కూడా టమాటాను వేయకూడదు. గుమ్మడికాయ కూరల్లో టమాటాలు వేస్తే ఆ కూరల్లో పులుపు ఎక్కువ అయ్యి దాని టేస్ట్ పోతుంది. కాబట్టి ఈ కూరలో కూడా టమాటాలని వేయకూడదు.

బెండకాయ కూరలో కూడా టమాటాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే బెండకాయ ముందే జిగటుగా ఉంటుంది. ఇలాంటి దానిలో మీరు టమాటాలను వేస్తే అది మరింత జిగటగా అవుతుంది. ఇంకొకటి టమాటాల పులుపు, బెండకాయ రుచి మంచి కాంబినేషన్ ఏదైన అయితే కాదు. దీనివల్ల టెస్ట్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టి బెండకాయని ఈ కూరలో వాడకూడదు. టమాటాలను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలో స్టోన్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి టమాటా కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని కూరల్లో టమాటాలని ఉపయోగించవచ్చు. మరి అన్ని కర్రీస్ లో టమాటాలను అసలు వాడకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: