కాబట్టి వీటికి చాలా దూరంగా ఉండాలి. వెన్న, చీజ్, క్రీమ్ వీటిలో కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా తినకుండా ఉంటేనే మంచిది. ఇక చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాల తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. కేక్, కుకీస్ వంటి బేక్ చేసినా ఆహారాలలో ఉప్పు, క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్ తినటం ఏమాత్రం మంచిది కాదు. తగ్గించుకోవాలని భావించేవారు ఆ ఆహారాలను దూరంగా ఉంటే మంచిది. ఈ ఆహారాల వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది.
కనుక చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకునే వారు ఈ ఆహారాలని అసలు తినకండి. కాబట్టి అధిక బరువు పెరగకుండా ఉండాలంటే ఈ ఆహారాన్ని అసలు తినకండి. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం ముఖ్యంగా మనం ఉపయోగిస్తున్న నూనెలు మన శరీరంలో చెడు కొలస్ట్రాలను పెంచుతాయి. కాబట్టి నూనెలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పూర్వకాలంలో ఎక్కువగా గానగా నూనెని వాడేవారు. మరి ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చేసాయి. పూర్వకాలం వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ఆహారం ఎక్కువగా తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కనుక ఈ ఆహారాలను అస్సలు దగ్గరకి కూడా రానివ్వకండి.