ఈరోజుల్లో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని పట్టుమని మూడు నెలలు కాకుండానే విడాకులు తీసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ చిన్న చిన్న గొడవలకే విడాకులు దాకా వెళ్లడం అంతా మంచిది కాదు. వారి జీవితం ఎటూ కాకుండా కూడా పోతుంది. కాబట్టి ఆలోచించి ముందు అడుగు వేయడం చాలా మంచిది. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమనతల కారణంగా ఒకరి వల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవడానికి సపరేట్ రూమ్స్ ను ఎంచుకుంటున్నారు.

భార్యాభర్తల మధ్య గురక సమస్య, ఓకే దుప్పటిని ఇద్దరూ పంచుకునే సమస్య ఉంటే స్లీపింగ్ డైవర్స్ ను ఫాలో అవుతున్నారు. రాత్రి పడుకున్నా తర్వాత ఒకరు స్వార్ట్ఫోన్ వినియోగిస్తూ ఉండటం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా చాలామంది జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి హద్దుకుని పడుకోవటం ఇష్టం లేనివారు ఈ విధంగా ఎవరి రూమ్స్ లో వాళ్లు పడుకోవటం మంచిది. సాధారణంగా భార్యాభర్తలు అంటే కలిసి పడుకుంటారు దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్యులు చెబుతున్నారు.

కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవటమే మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండును ఫాలో అవుతున్నారు చాలామంది. నిద్ర అసమానతలతో ఇద్దరూ ఒకే చోట పడుకునే రోజు గొడవపడే కంటే, విడివిడిగా పడుకోవటమే మంచిది. ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవటం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ఏవైనా స్లీపింగ్ డైవర్స్ విషయంలో ఎవరి వర్షం వాళ్ళది... ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండటం గమనర్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: