అంతరిక్షంలో ఏడు నెలలు గడిపిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆమెకు ఊహించని సవాలు ఎదురైంది. అదేంటంటే, ఆమె ఇప్పుడు నడవడానికి కష్టపడుతున్నారు. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటం వల్ల, నడక ఎలా ఉంటుందో కూడా మర్చిపోయానని ఆమె స్వయంగా చెప్పారు. ఇది చూస్తుంటే, అంతరిక్ష ప్రయాణాలు మానవ శరీరంపై ఎంత ప్రభావం చూపుతాయో అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

అంతరిక్షంలో వ్యోమగాములు బరువు లేకుండా తేలియాడుతూ ఉంటారు. సునీతా విలియమ్స్ ఏడు నెలలు అంతరిక్షంలో ఆల్రెడీ గడిపేశారు, అంతరిక్షంలో ఉన్నంతకాలం ఆమె ఎప్పుడూ కూర్చోలేదు లేదా పడుకోలేదు. కండరాలు, ఎముకలు బరువును మోయలేదు. అయితే అక్కడే ఎక్కువసేపు ఉండాల్సి రావడం వల్ల నడవడం మర్చిపోయింది ఆ నడకను మళ్ళీ నేర్చుకోవడానికి చిన్నారుల మాదిరి స్టెప్పులు వేస్తోంది.

సాధారణంగా సునీతా విలియమ్స్ మిషన్ ఒక నెల మాత్రమే ఉండాల్సింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా, ఆమె, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి అనుకున్న దానికంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగానే వాళ్లు సాధారణ జీవితానికి అలవాటు పడటానికి ఎక్కువ సమయం పడుతోంది.

సునీతా విలియమ్స్ నడవడానికి ఇబ్బంది పడుతుండటం చూస్తే, చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడు నెలల్లోనే వ్యోమగాములు నడవడం మర్చిపోతే, ఇక చాలా సంవత్సరాలపాటు ఉండే మిషన్లలో పరిస్థితి ఏంటి? అంతరిక్ష సంస్థలు మార్స్‌కు కూడా ప్రయాణాలు పంపాలని చూస్తున్నాయి. అక్కడకు వెళితే, సంవత్సరాలపాటు ఉండాల్సి ఉంటుంది. అప్పుడు వ్యోమగాముల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

అంతరిక్ష ప్రయాణం వల్ల మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనే దానిపై శాస్త్రవేత్తలు, వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న తర్వాత, వ్యోమగాములు త్వరగా కోలుకునేలా చేయడానికి మంచి మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.

సునీతా విలియమ్స్ చాలా కష్టాల్లో ఉన్నా, ఆమె మాత్రం చాలా పాజిటివ్‌గా ఉన్నారు. అంతరిక్షంలో ఉన్నన్ని రోజులు ఆమె తన కుటుంబంతో టచ్‌లో ఉంటూ, తన అనుభవాన్ని ఆనందిస్తున్నారు. కానీ, ఎక్కువ రోజులు ఉండటం వల్ల తన వాళ్ళకు దూరంగా ఉండాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: