చాలామంది తమ దాన్ని పెంచడంలో రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అందంగా ఉండాలంటే రకరకాల జ్యూస్లను కూడా తాగుతూ ఉండాలి. ఆడవారమే కాదు మగవారు కూడా తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందంగా ఉండాలంటే ఈ జ్యూస్ లని తప్పకుండా తాగండి. పైనాపిల్ జ్యూస్ తాగితే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగటం వల్ల మొటిమలు తగ్గుతాయి. మొఖం అందంగా కూడా కనిపిస్తుంది. కలబంద జ్యూస్ తాగితే చర్మం మృదువుగా మారుతుంది. కలబంద జ్యూస్ లోని పోషకాలు చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.
కలబంద చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాపిల్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. యాపిల్ జ్యూస్ తాగితే చర్మం మెరుస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ ని డైలీ తాగటం మంచిది. బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. వీటిలో మాంగానేస్, విటమిన్ సి, పోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. క్యారెట్ రసం తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యారెట్ రసంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.