చింతపండు మనం ప్రతి వంటకాల్లోనూ వాడుతూ ఉంటాము. చింతపండు ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి తెలిసిందే. చింతపండులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చింతపండు లేకుండా వంటలే పూర్తి కావు. పప్పు లేదా పప్పు చారు వంటకాల్లో, పులుసు వంటకాల్లో చింతపండు తప్పకుండా వేయాల్సిందే. చింతపండు రుచి అంటే చాలా మందికి ఎంతో ఇష్టం కూడా ఉంటుంది. అయితే పుల్లగా ఉందని చెప్పి చింతపండును తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కొంతమంది మాత్రం చింతపండుని చాలా ఇష్టం గా తింటూ ఉంటారు. ఇక కొందరు గ్యాస్ ట్రబుల్ అని చెప్పిన చింతపండు నువ్వు దూరం పెడుతుంటారు.

 అయితే వాస్తవానికి ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం మనం ఆరు రకాల పుచ్చులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వాటిల్లో చింతపండు కూడా ఒకటి. ఈ క్రమంలోనే చింతపండును తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చింతపండులో మెగ్నీషియం అధిక మొత్తంలో లభిస్తుంది. మనకు రోజుకు కావాల్సిన మెగ్నీషియం లో చింతపండు ద్వారా దాదాపుగా 25 శాతం మేర పొందవచ్చు. మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో రాత్రిపూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి.

శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి కండరాలను నొప్పులు ఉంటాయి. అలాంటివారు మెగ్నీషియం ఉండే ఆహారాలను తింటే నొప్పులు తగ్గుతాయి. కనుక చింతపండును ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చింత గింజలను వేయించి వాటిలో ఉండే పప్పు తీసి దాన్ని పొడిలా చెయ్యాలి. అందులో కాస్త నీళ్లు కలిపి పోరు వెచ్చగా ఉన్నప్పుడే కీళ్ల లేదా మోకాళ్ళపై రాసు కోవాలి. దీంతో కీళ్లు, మోకాళ్లు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. చింతపండును తీసుకుంటున్నా కూడా ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇకపై చింతపండును అంత లైట్ తీసుకోకండి. చింతపండును అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాలు నాశనం కాకుండా రక్షిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: