బాదాంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు ఆకలిని దూరంగా ఉంచి, అతిగా తినే అలవాటును తగ్గిస్తాయి, తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. బాదం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. బాదం రాత్రి నానపెట్టుకుని ఉదయాన్నే తినడం మంచిది. బాదం పప్పుని నానబెట్టి తీసుకోవటం వల్ల ప్రోటీన్ బాగా అందుతుంది. కండరాలు బలంగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా పూర్తి ఆరోగ్యానికి సహకరిస్తాయి. బాడీ ఫిట్ గా ఉంటుంది. గుండెకు సంబంధిత సమస్యలను దరి చేరనివ్వదు. నానబెట్టిన బాదంపప్పును తీసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి. నానబెట్టిన బాదం తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం గా ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలు దూరంగా ఉండొచ్చు. నానబెట్టిన బాదం తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యల నుండి సులువుగా బయటపడొచ్చు. అజీర్తి, మలబద్ధకం వంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఎముకలు బలంగా, దృఢంగా ఉండడానికి నానబెట్టిన బాదం రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. నానబెట్టిన బాదం రోజు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రి రాడికల్స్ వల్ల నష్టం కలగకుండా చేస్తుంది. ఇంఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది.