నారింజ పండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మం మరియు జుట్టు అందాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగకరం. నారింజలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా ఉంచుతుంది. నారింజతో అందం రీటైన్ చేసుకోవడానికి ఉపయోగించే విధానాలు. చర్మానికి కాంతిని ఇస్తుంది నారింజలోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తేజస్సుగా, కాంతివంతంగా మారుస్తాయి. నారింజ రసం మెడకు, ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. మృతకణాలను తొలగిస్తుంది నారింజ పొట్టు పొడి చర్మం పైని మృతకణాలను తొలగించి, కొత్త చర్మాన్ని బయటకు తీసుకొస్తుంది. చెంచా నారింజ పొట్టు పొడి + 1 చెంచా తేనె + 1 చెంచా పెరుగు మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.

 మొటిమలు  చర్మ సమస్యల నివారణ నారింజలోని సిట్రిక్ ఆమ్లం మొటిమలను తగ్గిస్తుంది. నారింజ రసంలో కాస్త పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. నారింజ పండు అందాన్ని రెట్టింపు చేయడానికి చాలా సహాయపడుతుంది. నారింజలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నారింజ పండును గుజ్జు కింద చేసుకుని బోప్పాయి గుజ్జు కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

అరటి గుజ్జులో నారింజ పండు గుజ్జుని మిక్స్ చేసి ముఖానికి రాయటం మంచిది. ఇలా రాసిన పావుగంట తర్వాత కడుక్కుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది. నారింజ పండు రసంలో సెనగపిండి, రోజు వాటర్ కలిపి పేస్ట్ చేసుకోండి. ఈ విశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చూడటం వలన పిహెచ్ బ్యాలెన్స్ బాగుంటుంది. గ్రీన్ టీ ఆకుల్లో నారేంజ పండు గుజ్జు వేసి పేస్ట్ కింద చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇది మంచి ఎక్స్ ఫోలియెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మం పై ఉన్న జిడ్డును తొలగిస్తుంది. నారింజ పండు గుజ్జులో కొబ్బరి నూనె కలిపి పేస్ట్ చేసుకోండి. దీనిని ముఖనికి మురికి తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: