భోజనం తర్వాత బెల్లం టీ తాగితే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. రక్తహీనత నివారించగలదు. బెల్లంలో అధికంగా ఉండటంతో, ఇది రక్తహీనత ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు & చిన్నపిల్లలు దీన్ని తీసుకుంటే హెమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. బెల్లం సహజంగా ఎండోక్రైన్ వ్యవస్థ ను మెరుగుపరిచి, హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మహిళలకు PCOS, మాసిక ధర్మ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకుంటే మేలు కలుగుతుంది. అధిక బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. బెల్లం శరీరంలో చెడు కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. ఉదయాన్నే ఉదయం గోరు వెచ్చని నీటిలో బెల్లం & నిమ్మరసం కలిపి తాగితే శరీర డిటాక్స్ అవుతుంది & బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
చలికాలంలో బెల్లం టీ శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. వేసవిలో చల్లటి బెల్లం టీ తాగితే శరీర వేడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించగలదు. బెల్లంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచే గుణాలు ఉంటాయి, ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. రోజూ ఒక కప్పు బెల్లం టీ తాగితే స్ట్రెస్, ఆంగ్జయటీ తగ్గుతుంది. కప్పు నీరు,1/2 చెంచా తరిగిన అల్లం,చెంచా బెల్లం, 1/2 చెంచా టీ పొడి (లేదా పుదీనా ఆకులు) 1/2 చెంచా నిమ్మరసం, ఒక చిన్న తులసి ఆకులు. ఒక గిన్నెలో నీటిని మరిగించి, అల్లం & టీ పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి.ఇప్పుడు బెల్లం వేసి పూర్తిగా కరిగే వరకు మరిగించాలి. చివరగా నిమ్మరసం లేదా తులసి ఆకులు వేసి, 1 నిమిషం తర్వాత వడకట్టాలి.వెచ్చగా తాగితే ఆరోగ్యానికి చాలా మేలు.