శరీర బరువు పెరగడం, ఇన్సులిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మాద్యస్థంగా 7-8 గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మేలు. నిద్రకు 1-2 గంటల ముందు భోజనం చేయాలి. నిద్రకు ముందు భారీగా తినకూడదు. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. నిద్రకు 2 గంటల ముందు తేలికపాటి భోజనం లేదా ప్రోటీన్ & ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవచ్చు. రాత్రి చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం తప్పించుకోవాలి. నిద్రకు ముందు స్ట్రెస్ తగ్గించుకోవాలbఎక్కువ స్ట్రెస్ ఉంటే కార్టిసోల్ హార్మోన్ పెరిగి, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి.
నిద్రకు ముందు యోగా, ధ్యానం లేదా మృదువైన సంగీతం వింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్యాఫీన్, ఆల్కహాల్ తక్కువగా తీసుకోవాలి. నిద్రకు 4-6 గంటల ముందు కాఫీ, టీ, సోడా, ఆల్కహాల్ తాగకూడదు. ఇవి నిద్రను ప్రభావితం చేసి, షుగర్ లెవెల్స్‌ను అస్థిరం చేయవచ్చు. నిద్రించే గది చీకటి & చల్లగా ఉంచాలి. గది చీకటి & ప్రశాంతంగా ఉంటే మెలటోనిన్ హార్మోన్ విడుదలై మంచి నిద్ర వస్తుంది. అధిక ఉష్ణోగ్రత, శబ్దం, కాంతి ఉంటే నిద్ర సరిగా రాదు. మసాజ్ లేదా వెచ్చని పాలు తాగడం మంచి అలవాటు. నిద్రకు ముందు కొందరికి వెచ్చని పాలు లేదా హెర్బల్ టీ తాగడం మంచిది. రాత్రి నిద్ర ముందు మోబైల్ / టీవీ చూస్తే తప్పు. నిద్రకి 30-60 నిమిషాల ముందు మొబైల్, టీవీ, లాప్‌టాప్ ఉపయోగించడం మానేయాలి. వీటిలోని బ్లూ లైట్ మెదడు నిద్ర హార్మోన్లను తగ్గిస్తుంది.