తమలపాకులోని పొటాషియం & యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.ఇది రక్తపోటును నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తమలపాకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల నోటి ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు తగ్గుతాయి. ఇది నోటి దుర్వాసన తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. తమలపాకులోని యాంటీసెప్టిక్ గుణాలు గాయాలు, మంటలు, చర్మంలోని అలర్జీలను తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో తమలపాకు ముంచి, దాన్ని గాయం లేదా చర్మం పై ఉంచితే నొప్పి తగ్గుతుంది.మానసిక ప్రశాంతత & ఒత్తిడి తగ్గింపు. తమలపాకు నరాలను శాంతింపజేసి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
తలనొప్పి ఉన్నవారు తమలపాకును తలపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది. చాలామంది తమలపాకులను ఎక్కువగా తింటూ ఉంటారు. ఆస్తమాను నమలూతు ఉంటారు. తమలపాకులు తినటం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తమలపాకులు నోటి శుభ్రతను కాపాడతాయి. బ్యాక్టీరియాను అరికట్టి చిగుళ్ల, పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరించడంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇవి మంచివి. తమలపాకులు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్త ప్రసరణ మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తమలపాకులు జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. అల్సర్లు రాకుండా చేస్తాయి. కాలేయం ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.